సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ.... ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. న్యాల్ కల్ మండలం రేజింతల్ గ్రామానికి చెందిన పూజితకు పురిటి నొప్పులు రావడంతో... కుటుంబసభ్యులు ఉదయం ఏడున్నర సమయంలో మిర్జాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రికి తాళం వేసి ఉండటం, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవటంతో.... అప్పటికే నొప్పులు భరించలేకపోతున్న మహిళ... రోడ్డుపైనే ప్రసవించింది.
అనంతరం తల్లిబిడ్డను అంబులెన్సులో జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిర్జాపూర్‌లో 24గంటల సేవలు అందించేలా.... 30పడకలతో ఆస్పత్రి నిర్మించినా ఉపయోగంలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి... ఆస్పత్రిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద