ETV Bharat / state

'అట్రాసిటీ కేసులో న్యాయవాది ద్వారా సమాధానమిస్తా'

చట్టాలతో పాటు ప్రతీ ఒక్కరినీ తాను గౌరవిస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. తానే స్వయంగా వెళ్లి నోటీసులు తీసుకున్నానని... న్యాయవాది ద్వారా వివరణ ఇస్తామని వెల్లడించారు. తెరాస క్రమశిక్షణ గల పార్టీ అని అన్నారు.

author img

By

Published : Dec 17, 2020, 3:38 PM IST

patancheru-mla-mahipal-reddy-press-meet
నేను అందరినీ గౌరవిస్తా: మహిపాల్ రెడ్డి

చట్టాలతో పాటు అందరినీ తాము గౌరవిస్తామని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. స్వయంగా వెళ్లి నోటీసులు తీసుకున్నానని... న్యాయవాది ద్వారా వివరణ ఇస్తామని తెలిపారు. ఈ విషయంలో చట్టపరమైన న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు.

జర్నలిస్టును బెదిరించానని పోలీసులు అత్యుత్సాహంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయవాది ద్వారా నోటీసులకు సమాధానమిస్తామని తెలిపారు. తెరాస పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని... తెరాస నాయకులందరూ చట్టాలను, ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారని అన్నారు.

ఇదీ చదవండి: యువతిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన దుండగులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.