సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ ముందు.. సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. 20వ తేదీ దాటినా జీతాలు అందలేదని వాపోయారు. ప్రతినెలా వేతనాలు ఆలస్యమవుతున్నాయని ఆవేదన చేందారు.
జీతాలు ఆలస్యమైతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. అధికారులు స్పందించాలి. సకాలంలో వేతనాలు అందజేయాలి.
- గ్రామ పంచాయతీ సిబ్బంది
సకాలంలో జీతాలు అందజేయకుంటే గ్రామ పంచాయతీ కార్మికులను ఐక్యం చేస్తామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: బయటికి రండి... నిధులపై కలిసి పోరాడుదాం : పొన్నం