ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి సాధ్యమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.
గ్రామస్థులు కలిసికట్టుగా ముందుకు సాగితేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెండో దశ పల్లెప్రగతిని విజయవంతం చేయాలని కోరారు.
ఇవీ చూడండి: 'నేను సీఎం అవుతాననే చర్చే అవసరం లేదు"