పాఠశాలకు వెళ్లి వస్తుండగా.. పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తానన్న కుమారుడిని డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి సమీపంలో జరిగింది. కానుకుంట హైస్కూల్లో మల్లికార్జున్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజులాగే సైకిల్‌పై పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం బాలుడి సైకిల్నుబలంగా ఢీకొంది. తీవ్రగాయాలైన మల్లికార్జున్‌ను నగరంలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఈలోపే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు పిల్లల్లో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడం వల్లతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:పారికర్‌కు కడసారి వీడ్కోలు