సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి ఇస్నాపూర్ సబ్ స్టేషన్లో లైన్మెన్గా పనిచేస్తున్నాడు. అతని సోదరుడు ఆసిఫ్ కూడా అక్కడే తాత్కాలిక కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అందులో భాగంగానే రుద్రారం శివారులోని విద్యుత్ స్తంభంపపై కొత్త ఫ్యూజులు అమర్చేందుకని స్తంభం ఎక్కాడు.
పనిపూర్తవగానే విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అక్కడ నిప్పు చెలరేగడం వల్ల మరోసారి విద్యుత్‌ను నిలిపివేసి మరలా స్తంభం ఎక్కాడు. కానీ ప్రమాదవశాత్తు అక్కడ విద్యుత్ సరఫరా అయి ఆసిఫ్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన స్థానికులు ఆసిఫ్‌ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇవీ చూడండి: 'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'