సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఉస్మానియా ప్రొఫెసర్ శేఖర్ పాల్గొన్నారు. "ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్- స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ సోషల్ సైన్సెస్" అనే అంశంపై ఈ కార్యశాలలో చర్చించనున్నారు. డేటా ప్రాసెస్సింగ్ ఎలా చేయాలి... సులభతరంగా ఎలా ముందుకు సాగాలో ప్రొఫెసర్లు విద్యార్థులకు అవగహన కల్పించారు. బట్టి చదువులను విద్యార్థులు మానుకొని.. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ప్రొఫెసర్లు సూచించారు.
ఇదీ చూడండి: ప్రజల నుంచి తీసుకుంటున్నారు.. ప్రభుత్వానికి చెల్లిస్తలేరు!