ETV Bharat / state

భారీ వరదతో ఉవ్వెత్తున పొంగిపొర్లుతున్న నల్లవాగు

author img

By

Published : Sep 15, 2020, 9:23 AM IST

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్​ మండలంలోని నల్లవాగుకు భారీగా వరద పోటెత్తింది. నిండుకుండలా మారిన వాగు రెండు అడుగులకుపైగా అలుగు పారుతోంది.

nallavagu flooded with heavy rain in sangareddy district
భారీ వరదతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నల్లవాగు

ఎడతెరిపి లేకుండా సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి సంగారెడ్డి జిల్లాలోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. నారాయణఖేడ్​ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలో కురిసిన వర్షాల వల్ల సిర్గాపూర్​ మండలంలోని నల్లవాగుకు వరద పోటెత్తింది. నిండుకుండలా మారిన నల్లవాగు రెండడుగులకు పైగా అలుగు పారుతోంది.

నల్లవాగులో పొంగడం వల్ల రెండు టీఎంసీల నీరు వృథాగా కిందకు పోతోంది. నల్లవాగు కింద దాదాపు 8వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వాగు నిండుకుండలా మారడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.