సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో శ్మశానవాటిక నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిర్వహించారు. మనిషి తన జీవితకాలంలో చివరి మజిలీని ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా రుసుము నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే శ్మశానవాటికకు సంబంధించి ట్రయల్ పనులు సైతం పూర్తయినట్లు తెలిపారు.
కరోనా వైరస్‌తో మరణించిన మృతదేహాలకు 7,500 రూపాయలు, సహజ మరణాల మృతదేహాలకు 6వేల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శ్మశానవాటికను నిర్మించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి : వ్యాక్సిన్ వేసుకోవాలని సీఎం ఎందుకు చెప్పటం లేదు: బండి సంజయ్