పరిశ్రమలను బాహ్యవలయ రహదారి అవతలికి తరలించాలనే నిర్ణయం ఉన్నప్పటికీ.. ఆచరణలోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాదంపై స్పందించారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మహిపాల్ రెడ్డి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమల యాజమాన్యాలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గాయపడ్డ వారికి అండగా ఉంటామన్న ఎమ్మెల్యే.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. యాజమాన్యంతో మాట్లాడి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : నకిలీ పత్రాలతో భూకబ్జాలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు