పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస నాయకులతో కలిసి మొక్కలు నాటారు. కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఎడిటర్ విసిరిన ఛాలెంజ్‌ను తాను స్వీకరించానన్న ఎమ్మెల్యే... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ ఘంటా చక్రపాణి, గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ దినేశ్ దాస్, టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జార్జి రెడ్డి సినిమా డైరెక్టర్ జీవన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ నిఖిల రెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌లకు గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు.
ఇదీ చూడండి: సేనకు ఊహించని షాక్- 'థ్రిల్లర్'ను తలపించిన రాజకీయం