Harish Rao Auto Driving in Siddipet : ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలోని తన ఇంటిని తాకట్టు పెట్టి.. వచ్చిన డబ్బుతో సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోపరేటీవ్ సొసైటీని స్థాపించారు. ఇందులో ఆటో డ్రైవర్లను సభ్యులుగా చేర్పించి... వారి ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తున్నారు. సిద్దిపేటకు బ్రాండ్ అంబాసీడర్లు ఆటో డ్రైవర్లేనని హరీశ్‌రావు ప్రకటించారు.
Harish Rao Auto Driving in Video : ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన ఆటో క్రెడిట్ కోపరేటీవ్ సోసైటీ వార్షిక సమావేశంలో హరీశ్‌రావు డ్రైవర్ మాదిరిగా కాకిచొక్కా ధరించి ఆటో నడుపుకుంటూ సభా ప్రాంగణానికి వచ్చారు. ఏకంగా తన చోక్కాపై హరీశ్ రావు అని పేరు సైతం రాయించుకున్నారు. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన అన్నీ కార్యక్రమాల్లో ఆయన అదే కాకీ చొక్కాతోనే పాల్గొన్నారు
KTR Auto Driving in Sangareddy : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మహీంద్రా పరిశ్రమలో బ్యాటరీ వాహనాల తయారీ యూనిట్ భూమి పూజలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆటో నడుపుతూ సందడి చేశారు. మహీంద్రా సంస్థ విద్యుత్ వాహనాల శ్రేణిలో భాగంగా తయారు చేసిన ఆటోలను పరిశీలించిన మంత్రి.. వాటిపై ముచ్చట పడ్డారు. సభా ప్రాంగణం వరకు స్వయంగా తానే ఆటో నడుపుకుంటూ వచ్చారు. మంత్రి కేటీఆర్ ఆటో నడపడంతో.. కార్మికులు, పరిశ్రమ ప్రతినిధులు, అధికారులు ఆశ్యర్యంగా చూస్తూ ఉండిపోయారు. క్లాస్‌కి కాస్.. మాస్‌కి మాస్ అంటూ.. బావా, బావమరిది ఇద్దరూ ఆటోలో రయ్ మంటూ దూసుకెళ్లడం అందరినీ ఆకర్షించింది.
యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి: ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పరిశ్రమల్లో యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. పరిశ్రమల యాజమాన్యానికి సూచించారు. యువత తమలో ఉన్న నైపుణ్యాలను అభివృద్ది చేసుకోవాలని సూచించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నగరాల్లో పారిశుద్ధ్యం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. స్థానికంగా ఈ వాహనాలు తయారు చేసే సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. బ్యాటరీ వాహనాల తయారీ కోసం మహింద్రా కంపెనీ రూ.1000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం హర్షనీయమని అన్నారు. భవిష్యత్తు అంతా ఎలక్టిక్ వాహనాలదేనని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: