HarishRao About Gurukula schools: నాడు ఇచ్చిన మాటను.. నేడు నిలబెట్టుకుంటున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 8 ఏళ్లలో 8 గురుకులాలు తెచ్చి చూపించామన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లోని కంగ్టి మండలంలో నాలుగున్నర కోట్లతో నిర్మించిన గిరిజన గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంత్రి హారీశ్‌రావు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, కలెక్టర్ శరత్.. భోజనం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 91 గిరిజన గురుకులాలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 183కి పెంచామని మంత్రి తెలిపారు. వాటితో పాటు మహిళా గురుకులాలు కూడా తీసుకొచ్చామని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్ణాటకలో వడ్లు కొనకపోవటం వల్ల.. తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉందని మంత్రి పేర్కొన్నారు.
"నాడు మాట ఇచ్చాం.. ఇప్పుడు నిలబెట్టుకున్నాం. 8 ఏళ్లలో 8 గురుకులాలు తెచ్చి చూపించాం. నారాయణ్‌ఖేడ్ వెనుకబడలేదు. కాంగ్రెస్, తేదేపా ప్రభుత్వాలు వెనక్కి పడేశారు. సంగారెడ్డిలో రెసిడెన్షియల్ లా కళాశాల తెచ్చాం. తాగడానికి నీళ్లు లేని ఈ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి.. రెండు పంటలు పాండేలా చేస్తాం. హైదారాబాద్‌లో బటన్ నొక్కితే.. మీ బ్యాంకుల్లో రైతుబంధు పైసలు పడుతున్నాయి. అప్పులు లేవు, పైరవీలు లేవు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలోనే ఏకంగా 100 కోట్లు ఇస్తున్నాం. పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతమైన సేవలు అందిస్తున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం. రేషన్‌కార్డులు కూడా ఇస్తాం. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేలా సాయం అందిస్తాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తున్నాం.దిల్లీ ప్రభుత్వం వడ్లు కొనదు. ఉపాధి హామీ పథకం లేకుండా చేస్తోంది." - హరీశ్‌రావు, మంత్రి
ఇవీ చూడండి: