ETV Bharat / state

'మనకు వ్యవసాయం రాదని ఆంధ్ర వాళ్లు హేళన చేశారు.. కానీ ఇప్పుడు'

author img

By

Published : Jun 22, 2021, 10:06 AM IST

Updated : Jun 22, 2021, 10:42 AM IST

ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో తెరాస ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆయన నినదించిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం కేసీఆర్ నాయకత్వంలో కృషి చేస్తున్నామని తెలిపారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులు ప్రారంభించిన ఆయన ఇంటింటికి తాగునీరు ఇచ్చినట్టే.. పొలంపొలానికి సాగునీరు ఇస్తామని స్పష్టం చేశారు.

పొలం పొలానికి నీళ్లందిస్తాం..: హరీశ్ రావు
పొలం పొలానికి నీళ్లందిస్తాం..: హరీశ్ రావు

'మనకు వ్యవసాయం రాదని ఆంధ్ర వాళ్లు హేళన చేశారు.. కానీ ఇప్పుడు'

రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగునీరు అందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆర్థిక మంత్రి హరీశ్ రావు... బోరంచలో ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు.

పొలం పొలంకి నీళ్లందిస్తాం..

70 ఏళ్ల సమైఖ్య పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చుక్క నీరు తేలేదని హరీశ్ రావు విమర్శించారు. గుక్కెడు మంచి నీళ్లు వస్తే చాలనుకున్న నారాయణఖేడ్​కు తాము తాగు నీరు, రోడ్లు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతులను తీసుకువచ్చామన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సాగు నీరు తీసుకువస్తామని.. చెరువులు, కుంటలు, వాగులు అన్ని నింపుతామని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా నారాయణఖేడ్, అందోలో నియోజకవర్గాల పరిధిలోని 1.65లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. రైతులు వాన కోసం ఆకాశం వైపు చూడాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు.

నవ్వినోళ్లే నోరెళ్లబెట్టారు..

తెలంగాణ వాళ్లకు వ్యవసాయం రాదని ఆంధ్ర ప్రాంతం వాళ్లు హేళన చేసేవారని.. ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా వడ్లు పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ వేసవిలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించామన్నారు. సమైఖ్య పాలనలో అన్నదాతలకు కనీసం పంటరుణాలు కూడా సమయానికి అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వానలు పడకముందే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేసిందన్నారు. సోమవారం నాటికి 7 ఎకరాల లోపు ఉన్న 57,69,980 మంది రైతుల ఖాతాల్లో రూ.6,012కోట్ల రైతు బంధు నిధులు జమ చేశామని ఆయన తెలిపారు. సాగునీరు వచ్చిన తర్వాత నారాయణఖేడ్ ముఖచిత్రం మారుతుందని మంత్రి హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: వరంగల్​ అర్బన్​ పేరు హన్మకొండ జిల్లాగా మార్పు

Last Updated : Jun 22, 2021, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.