సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దత్తాత్రేయ స్వామి వారిని మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహిస్తున్న సహస్ర చండీఘటాభిషేకంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే రహదారికి, సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పూజారులు ఉండేందుకు వీలుగా రెండు పడకగదులు ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధుల వచ్చేలా కృషి చేస్తానని హరీశ్ రావు వెల్లడించారు.
'దత్తాత్రేయ స్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తా' - minister harish rao
హత్నూర మండలంలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.