ETV Bharat / state

బీహెచ్​ఈఎల్​ సంస్థ అభివృద్ధి కోసం 'మనం గ్రూప్​ యాప్​'

బీహెచ్ఈఎల్ ఉద్యోగి సురేందర్ తయారు చేయించిన 'మనం గ్రూప్ యాప్'ను భెల్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకు ఉపాధ్యక్షుడు రమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ యాప్​తో భెల్​ సంస్థకు చెందిన ఉద్యోగులకు సమాచారం క్షణాల్లో తెలుస్తుందని తెలిపారు.

manam group app inauguration in sangareddy dsitrict
బీహెచ్​ఈఎల్​ సంస్థ అభివృద్ధి కోసం 'మనం గ్రూప్​ యాప్​'
author img

By

Published : May 15, 2020, 5:35 PM IST

'మనం గ్రూప్ యాప్' దేశంలోని 14 యూనిట్ల కార్మికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని బీహెచ్​ఈఎల్​ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకు ఉపాధ్యక్షుడు రమేష్ కుమార్ తెలిపారు. బీహెచ్ఈఎల్ ఉద్యోగి సురేందర్ తయారు చేయించిన 'మనం గ్రూప్ యాప్'ను రమేష్ కుమార్, సంస్థ డైరెక్టర్లతో కలిసి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం భెల్​ టౌన్​షిప్​ సొసైటీ బ్యాంకులో ఆవిష్కరించారు. ఈ యాప్​తో బీహెచ్​ఈఎల్​(భెల్​)​ సంస్థకు చెందిన ఉద్యోగులకు సమాచారం క్షణాల్లో తెలుస్తుందన్నారు.

తయారు చేయించిన సురేందర్​ను ఆయన అభినందించారు. భెల్ సంస్థ అభివృద్ధి కోసం ఉద్యోగులు ఈ యాప్ ద్వారా మంచి సలహాలు, సూచనలు చేసే వీలుంటుందని యాప్ రూపకర్త సురేందర్ అన్నారు. అదేవిధంగా కార్మిక సంఘాలు, యాజమాన్యాలు సంస్థకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. భెల్ ఉద్యోగులు ఎక్కడ ఏం జరిగిందన్న సమాచారంతో, అందరూ సంస్థ అభివృద్ధి కోసం నూతన ఒరవడిని సృష్టించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇవీ చూడండి: త్వరలోనే సమగ్ర వ్యవసాయ విధానం: మంత్రి నిరంజన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.