భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 65 ఏళ్ల నర్సింహులు సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో ఉంటున్నాడు. కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్సు స్టేషన్ సమీపంలో ఇతను అనుమానస్పద స్థితిలో మరణించాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: 'ఇక్కడ చిక్కుకుపోయాం.. మమ్మల్ని భారత్ తీసుకెళ్లండి'