రెండేళ్లక్రితం మద్యం మత్తులో ఓ మూడేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి సంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మూర్తి నగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. 2017 డిసెంబర్ 31న మద్యం మత్తులో అదే ప్రాంతానికి చెందిన ఓ మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అరవడం వల్ల అటుగా వెళ్తున్న స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన సంగారెడ్డి కోర్టు నిందితుడు శ్రీనివాస్‌కు జీవితఖైదుతోపాటు 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. కేసులో సరైన ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన అమీన్‌పూర్ పోలీసులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ అభినందించారు.
ఇవీ చూడండి: 'మున్సిపల్ ఎన్నికల పిటిషన్లన్నీ ధర్మాసనం ముందుకు..'