జాతిరత్నాలు సినిమా బృందం సభ్యులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రుక్మిణి థియేటర్లో సందడి చేశారు. థియేటర్లో ఈ చిత్రం రెండు రోజులుగా ప్రసారమవుతోంది. దర్శకుడు అనుదీప్ జిల్లా వాసి కావడంతో ప్రజలు సినిమా చూడటానికి భారీగా తరలి వస్తున్నారు.
సంగారెడ్డి, జోగిపేట పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ఎక్కువగా జరగడంతో జిల్లా ప్రజల్లో సినిమాపై ఆసక్తి పెంచేలా చేసింది. చిత్రాన్ని గొప్పగా ఆరాధిస్తున్నందుకు సినీ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. అనుదీప్, హీరో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, కథానాయిక ఫారియా అబ్దుల్లా, థియేటర్ యాజమాన్యం పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బెంగళూరు డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: తనీష్