ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ఫోన్ చేసింది వాస్తవమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. ఏం మాట్లాడారో బహిర్గతం చేయనని స్పష్టం చేశారు. రాజకీయ అంశాలపై తమ ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరూ కూడా తెరాస, భాజపాలోకి వెళ్లే ఆలోచన చేయరన్నారు. గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని బలోపేతం చేస్తానన్నారు. పార్టీ కేడర్ చాలా బలంగా ఉందని... నాయకులే సందిగ్ధంలో ఉన్నారని చెప్పారు.
ఇదీ చూడండి: ప్రకాశం బ్యారేజ్లో కేసీఆర్... ఏం చేశారంటే!