led lighting on ORR : బాహ్య వలయ రహదారిని మరిపించేలా ప్రాంతీయ వలయ రహదారిని నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇంటర్ ఛేంజ్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్‌పై విద్యుద్దీపాలను మంత్రి ప్రారంభించారు. హెచ్ఎండీఏ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 136 కిలోమీటర్ల పరిధిలో రూ.100.22 కోట్లతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను మంత్రి కేటీఆర్ ప్రారభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఏ నగరానికి లేనివిధంగా హైదరాబాద్ చుట్టూ బాహ్య వలయాలు ఉండడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారత దేశంలో ఏ మెట్రో నగరానికి కూడా ఇంత పెద్ద 160 కిలోమీటర్ల రింగ్ రోడ్డు లేదు. మంచి సౌకర్యాలు ఉన్నప్పుడు సహజంగానే పెట్టుబడులు రావడానికి, పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షించడానికి కూడా మార్గం దొరుకుతుంది. ఈ ఆస్తిని కాపాడుకోవడమే కాకుండా... ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 270.5కిలోమీటర్ల పరిధిలో 9,706 స్తంభాలను ఏర్పాటు చేసి వాటిలో 18,220 ఎల్ఈడీ లైట్లను అమర్చి రోడ్డును ప్రకాశవంతంగా తీర్చిదిద్దారు. కేసీఆర్ గారు ఏది తలపెట్టినా పెద్దగా ఆలోచిస్తారు. కాబట్టి 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్‌రోడ్డు కూడా ఔటర్ రింగ్‌రోడ్డును తలపించే విధంగా చేపడతాం. -కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి.
ఇదీ చూడండి: Minister KTR in sangareddy: 'సఫాయి కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే'