కరోనా చికిత్సలో వెంటిలేటర్లది కీలక పాత్ర. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బాధితుల సంఖ్యకు తగ్గట్టుగా వెంటిలేటర్లు లేక.. మరణిస్తున్నారు. అతి తక్కువ ఖర్చులో, వీలైనంత త్వరగా వీటిని తయారు చేయడంలో దేశంలోని అనేక పరిశోధన సంస్థలు దృష్టి సారించాయి. ఐఐటీ హైదరాబాద్ ఈ దిశగా కీలక ముందడుగు వేసింది. ఐఐటీలోని అంకుర సంస్థ లక్ష రూపాయల లోపే అత్యాధునీక ఫీచర్లతో వెంటిలేటర్ ను తయారు చేసింది. దీని ప్రత్యేకతలు, ఎప్పటి లోగా అందుబాటులోకి వస్తుందన్న అంశాలపై సంస్థ ప్రతినిధి ప్రోఫెసర్ రేణు జాన్ తో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.