సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను దింపేయగా ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాన్ని చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అకస్మాత్తుగా ఇంజిన్లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.
ట్రావెల్స్ బస్సు ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండగా... వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సామగ్రి మొత్తం దగ్ధమైంది.
ఇవీ చూడండి: పేదోడి ఇంటి కలను నెరవేర్చే పనిలో సర్కారు