కరోనా కట్టడికి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు విశేష సేవలు అందిస్తున్నారని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ భాజపా మండలాధ్యక్షుడు ఆకుల సాయికుమార్ అన్నారు. వీరి సేవలు వెలకట్టలేనివని సాయి కొనియాడారు. కొవిడ్- 19 కారణంగా గత 23 రోజులుగా వైరస్ అనుమానితులకు సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లకు అందరూ సహకరించాలన్నారు. దేశవ్యాప్తంగా ఎవ్వరూ తమ ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. ప్రజా రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న పోలీసులకు పార్టీ తరఫున అభినందనలు తెలియజేశారు. అనంతరం వారిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.
వారందరి సేవలు వెలకట్టలేనివి... అందుకే ఈ సన్మానం - FELICITATION BY BJP MANDAL PRESIDENT
సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్లో భాజపా ఆధ్వర్యంలో కరోనా క్లిష్ట కాలంలో సమాజానికి సేవలందిస్తున్న వారందరికీ సన్మానం చేశారు. ఈ మేరకు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్లను సన్మానించారు.