ETV Bharat / state

మాస్కులు లేకుండా బయటకు వస్తే జరిమానా తప్పదు: ఎస్పీ

కరోనా ఉద్ధృతి పెరుగుతున్నా.. కొంతమందిలో అప్రమత్తత కనపడటం లేదు. మాస్కు ధరించడం, భౌతిక దూరం వంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. ఇటువంటి వారికి అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి రోజు ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాస్కు లేకుండా వచ్చే వారికి ఉచితంగా అందించి.. ఇకపై మాస్కుతోనే బయటికి రావాలని సూచిస్తున్నారు. వచ్చే సోమవారం నుంచి మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాలకు వచ్చిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడానికి జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న చర్యలపై ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డితో ఈటీవీ భారత్​ ము​ఖాముఖి...

sangareddy sp chandra shekar
ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
author img

By

Published : Apr 1, 2021, 10:33 PM IST

సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డితో ముఖాముఖి

ప్ర: మరోసారి కరోనా ఉద్ధృతి కనిపిస్తోంది. రోజురోజూకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజల్లో అప్రమత్తత ఎలా ఉంది?

జ: రెండో దశ కరోనా ఉద్ధృతి ప్రారంభమైంది. గతంలో రోజుకు 10కేసులు వస్తే ప్రస్తుతం 50కి పైగా నమోదు అవుతున్నాయి. మా సిబ్బందిలోనూ పలువురు వైరస్​ బారిన పడుతున్నారు. జాగ్రత్త చర్యలు పాటించడంలో ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది కనీసం మాస్కు కూడా పెట్టుకోకుండానే బహిరంగ ప్రదేశాల్లోకి వస్తున్నారు. ఇటువంటి వారికి అవగాహన కల్పిస్తున్నాం. సోమవారం నుంచి మాస్కు లేకుండా బయటికి వచ్చే వారికి జరిమానాలు విధిస్తాం.

ప్ర: ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకునేలా ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జ: మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాలకు వచ్చారంటే వారు కరోనా వాహకులుగానే పరిగణించాలి. సోమవారం నుంచి ఎవరైనా మాస్కు లేకుండా బయటికి వస్తే జరిమానా విధిస్తాం. మాస్కు లేకుంటే దుకాణాల్లో, కార్యాలయాల్లోకి అనుమతించకుండా నిర్వాహకులుకు అవగాహన కల్పిస్తున్నాం. పరిశ్రమల్లో పని చేసే ప్రతి ఒక్కరు కూడా మాస్కు ధరించేలా ఆదేశాలు ఇచ్చాం.

ప్ర: ప్రస్తుతం చేస్తున్న తనిఖీలు కొనసాగిస్తారా? గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి?

జ: గ్రామీణ ప్రాంతాల్లో అక్కడి పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీలతో కలిసి వీటిని విస్తృతం చేస్తాం. దాదాపుగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా కూడా అవగాహన కల్పిస్తాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా తనిఖీలు కొనసాగిస్తాం.

ప్ర: ఎక్కువ మంది ఒక చోటుకు చేరే బస్టాండ్లు, సినిమా థియేటర్లు వంటి వాటిపై ఎలా దృష్టి సారించారు?

జ: సినిమా థియేటర్లు, దుకాణాలు, హోటళ్లు వంటి వాటికి మాస్కు ఉన్న వాళ్లనే అనుమతించాలి. మాస్కు లేకుంటే ఏట్టి పరిస్థితుల్లో లోనికి రానివ్వోద్దని నిర్వహకులకు ఇప్పటికే సూచనలు చేశాం.

ప్ర: కొంత మంది కనీస నిబంధనలు పాటించకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి వారికి ఎలాంటి సూచనలు చేస్తారు.

జ: పరిమితమైన వారితో వేడుకలు నిర్వహించుకోవాలని ఇప్పటికే నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా వేడుకలు నిర్వహించినా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లోనే వేడుకలు చేసుకోవాలి. మేము తనిఖీలు చేసి, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం.

ప్ర: కరోనా కేసుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్న మహారాష్ట్ర, మూడో స్థానంలో నిలుస్తున్న కర్ణాటకతో సంగారెడ్డి జిల్లాకు సరిహద్దు ఉంది. పక్క రాష్ట్రాల నుంచి కోరనా బాధితులు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు.

జ: ఇప్పటికైతే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదు. మాకు కూడా ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారి వివరాలు రావడం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు దూరంగా ఉండాలి. ఎవరైనా వస్తే వారిని కొద్ది రోజులు క్వారంటైన్​లో ఉంచాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.