సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీసులు డివిజన్ పరిధిలోని ఆయా గిరిజన తండాల్లో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన కల్తీ కల్లు, తయారీ సామగ్రిని ధ్వంసం చేశారు.
పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు... కంగ్టి మండలంలోని జీరిగి తండా, సిర్గాపూర్ మండలంలోని రాజేశ్వర్ తండా, పటేల్ తండాలో భారీ మోతాదులో ఇప్ప పువ్వు కషాయం, ఇప్ప పువ్వు నిల్వలు, నల్ల బెల్లం నిల్వలు దొరకగా... పోలీసులు ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.