తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ... ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 2లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మానవతా దృక్పథంతో ఫీల్డ్ అసిస్టెంట్లను క్షమించి వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీలో సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి... రోజుకు రూ. 600 చొప్పున వేతనం చెల్లించాలన్నారు.
మేట్లకు పారితోషకం రూ.5 ఇచ్చి శిక్షణ ఇవ్వాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో ఆహార సబ్సిడీలకు అదనంగా నిధులు కేటాయించాలన్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని... లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఉపకార వేతనాలు, బోధన రుసుముల దరఖాస్తు గడువు పెంపు