Drug Gang Arrested in Sangareddy : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ కొడకంచి శివారు ప్రాంతంలో అక్రమంగా మాదకద్రవ్యాలు రహస్యంగా తయారు చేస్తున్న ప్రాంతాన్ని ఎస్ఓటీ పోలీసులు గుర్తించి, ముఠా సభ్యులను పట్టుకున్నారు. గత 2నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫా జోలం, హెరైన్, కొకైన్(Cocaine), పలు రకాల డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం. దీంతో యాంటీ నార్కోటిక్ డ్రగ్ బృందం, సంగారెడ్డి పోలీసులు అక్రమంగా డ్రగ్స్ తయారుచేస్తున్న ప్రాంతంపై నిఘా పెట్టారు. అదునుచూసుకున్న పోలీసులు(Anti Narcotic Drug Team) డ్రగ్ తయారీ కేంద్రంపై చాకచక్యంగా వ్యవహరించి 14 కిలోల ఆల్ఫా జోలం తయారీకి వినియోగించే ముడిపదార్ధం 'నోర్డాజెపమ్' స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ తయారీ కేంద్రం వద్ద ఐదుగురు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యాంటీ క్యాన్సర్ డ్రగ్స్‌పై డీసీఏ ఉక్కుపాదం - భారీ మొత్తంలో నకిలీ మందులు స్వాధీనం
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చూస్తే సంగారెడ్డి జిల్లా కొడకంచి గ్రామశివారులో లింగాల సుమనకు చెందిన మూడు ఎకరాల మూడు గుంటల భూమిలో ఉన్న జామతోటను అడ్డాగా చేసుకొని ముత్తంగి గ్రామానికి చెందిన పాత నేరస్థుడు యూనుస్, గతంలో సెర్విన్ పరిశ్రమలో పనిచేయడంతో అక్కడ పరిచయమున్న రియల్ఎస్టేట్(Real estate) వ్యాపారి మాణిక్యాలరావుతో కలిసి అక్రమ డ్రగ్స్ తయారీకి తెర లేపారు.
"ఈ అక్రమ మాదకద్రవ్యాల తయారీలో నిందితుల్లో ఒకరైన మహ్మద్ యూనస్ అలియాస్ జక్కరాజు, ఇతనకు డ్రగ్స్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఏవిధంగా మత్తు పదార్ధాలు తయారీ చేయాలో బాగా తెలుసు. మరో నిందుతుడైన శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పథకం ప్రకారం డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారు. వీరికి సహాయంగా కెమిస్ట్ వచ్చి మరో నిందితుడు మాణిక్యాలరావు కలిసి జిన్నారంలో మండలంలో ఒక చిన్న అడవిలాంటి ప్రాంతంలో ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ల్యాబ్‌లో డ్రగ్స్ తయారీకి కావలసిన పరికరాలన్నింటినీ రాహుల్ రెడ్డి సిద్ధం చేసి నడుపుతున్నారు."-రూపేశ్, సంగారెడ్డి ఎస్పీ
డ్రగ్స్ దందా : వ్యాపారి మాణిక్యరావు, స్నేహితుడు శ్రీనివాసగౌడ్ కలిసి లీజుకు తీసుకుని ఒక రసాయన ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో మాదకద్రవ్యాలను గత రెండు నెలలుగా తయారుచేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరికి మరో స్థిరాస్తి వ్యాపారి కొడకంచి గ్రామానికి చెందిన శివశంకర్ గౌడ్, నిర్మల్ గౌడ్, అమీన్పూర్ మున్సిపల్ పరిధి రాహుల్ రెడ్డి, హత్నూర మండలం గుండ్లమాచనూరుకు చెందిన శ్రీశైలం యాదవ్‌లు సహకారం అందించేవారన్నారు.
Police Seized Drugs in Sanga Reddy : దీంతో వీరు అక్రమంగా కల్లులో మత్తునిచ్చేందుకు కలిపే ఆల్ఫా జోలం తయారీకి, అందులో వినియోగించే ముడిపదార్ధం నోర్డాజెపమ్ను ఎవ్వరికంటా పడకుండా తయారు చేస్తున్నారు. దీనిపై టీఎస్ నాబ్ బృందం(TS Knob Team), సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి దాదాపు రూ.3 కోట్లు విలువ చేసే నోర్డాజెపమ్ పట్టుకున్నారు. దీన్ని అక్రమంగా తయారుచేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో ప్రమేయం ఉన్న రాహుల్ రెడ్డి, శ్రీశైలం యాదవ్‌లు పరారీలో ఉన్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ తెలిపారు. వీరి నుంచి సమాచారాన్ని స్వీకరిస్తున్నారు.