ETV Bharat / state

విఘాతాలు దాటుకుని 108లోనే ప్రసవించిన మాతృమూర్తి

అడుగడుగునా విఘాతాలు ఆమెను వెంటాడాయి. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లయింది. ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానాకు వెళితే వైద్యులు లేరని తిరిగి పంపించేశారు. ఓ ప్రైవేటు అంబులెన్సులో వేరే ఆసుపత్రికి బయలు దేరింది. మార్గ మధ్యలో దానికి కూడా ప్రమాదం జరిగింది. ఎట్టకేలకు  108 సిబ్బంది ప్రసవం చేసి తల్లీ బిడ్డలను కాపాడారు.

author img

By

Published : Mar 21, 2019, 11:29 PM IST

డాక్టర్లు లేక రోగుల పాట్లు
డాక్టర్లు లేక రోగుల పాట్లు
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ అంతర్గామాకు చెందిన లక్ష్మీబాయి ప్రసవం నిమిత్తం బుధవారం ఉదయం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. వైద్య సిబ్బంది లేరని సంగారెడ్డి వెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది ఆమెను పంపేశారు. ఓ ప్రైవేటు అంబులెన్సులో సంగారెడ్డి ప్రభుత్వ దవఖానాకు బయలు దేరింది. మార్గ మధ్యలో ఆమె ప్రయాణిస్తున్న అంబులెన్సును ఓ పాఠశాల బస్సు ఢీకొట్టింది. చేసేదేమీ లేక 108కు సమాచారం అందించారు.

108లోనే ప్రసవం

సకాలంలో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది... ఆమెకు వాహనంలోనే సుఖ ప్రసవం చేశారు. తల్లీ బిడ్డలు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వారిని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వైద్యుడేమంటున్నారంటే...

ఆసుపత్రిలో హిమోగ్లోబిన్​ లేనందున ఆమెను సంగారెడ్డికి వెళ్లవలసిందిగా సూచించామని నారాయణఖేడ్​లోని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత ఎక్కువగా ఉందన్నారు.మారుమూల ప్రాంతంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం.

ఇదీ చదవండి:అయోధ్య రామునికి.. మిథిలానగరి జానకికి పెళ్లంటా!

Intro:Tg_Mbnr_08_21_Cogrees_Press_Meet_Avb_G3 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి నీ నీ గెలిపించేందుకు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాటన్ ప్రదీప్ కుమార్ గౌడ్ తెలిపారు

Body:దేవరకద్ర లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ యువ నాయకుడు జీ మధుసూదన్ రెడ్డితో కలిసి కాటం మాట్లాడుతూ ఈ నెల 23న కొత్తకోట లోని బి పి ఆర్ గార్డెన్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్న టు తెలిపారు. నేతలు పార్టీ మారుతున్న ఇబ్బంది లేదు కాంగ్రెస్ పార్టీ సముద్రం వంటిది నాయకులు రావడం బయటికి వెళ్లడం స్వలాభం స్వార్థం కోసమే చేస్తుంటారు కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఉంటారు . వారి కోసమే పార్టీ పనిచేస్తుంది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్త లో ఉత్సవం నింపేందుకు అందరితో టచ్లో ఉన్నామని అన్నారు

Conclusion:ఈనెల 23న నిర్వహించి కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.