ETV Bharat / state

'మూసీ కాలువలో దొరికిన మృతదేహం శివకుమార్​దే' - సంగారెడ్డి వార్తలు

Shivakumar murder case in Nagar Kurnool: నాలుగు నెలల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారులో శివకుమార్ మృతదేహం లభ్యమయింది. అప్పటికే బాగా పాడైపోయింది. దీంతో డీఎన్​ఏ పరీక్షకు పోలీసులు పంపించారు. ప్రస్తుతం ఆ రిపోర్టు నివేదిక వచ్చింది.

shiva
shiva
author img

By

Published : Mar 4, 2023, 12:40 PM IST

Shivakumar murder case in Nagar Kurnool: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులో గుడెసెల్లో ఉంటున్న నాగకర్నూలు జిల్లా కోడేరు గ్రామానికి చెందిన శివకుమార్ హత్య కేసులో పోలీసులు పంపిన డీఎన్ఏ నివేదిక నాలుగున్నర నెలల తర్వాత వచ్చింది. బాగా పాడైపోయిన వలిగొండ ప్రాంతంలో బ్రిడ్జివద్ద దొరికిన మృతదేహం శివమకుమార్‌దే అని నివేదికలో ధ్రువీకరించారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు గుడిసెల్లో నివాసం ఉంటున్న నాగర్​కర్నూలు జిల్లా కోడేరు గ్రామానికి చెందిన శివకుమార్​ను తమ కూతురిని ప్రేమించాడని యువతి తండ్రి, బాబాయ్​లు 2022 సంవత్సరం అక్టోబర్ ఏడో తేదీన హత్యచేసి కుషాయిగూడెం సమీపం మూసీనది కాలువలో పడేశారు. అప్పట్లో వర్షాలు బాగా కురవడం కాలువ ఉద్ధృతంగా ప్రవహించడంతో మృతదేహం కోసం దాదాపు వారం రోజులు గాలింపు చర్యలు చేపట్టారు.

అదే నెల 15వ తేదీన భువనగిరి జిల్లా వలిగొండ ప్రాంతంలో ఓ బ్రిడ్జివద్ద ఉన్న మృతదేహం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాడీని స్వాధీనం చేసుకుని రామన్నపేట ప్రాంతీయ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే అప్పటికే మృతదేహం బాగా పాడైపోయినందున శివకుమారేనా అన్న సందేహంతో అప్పట్లో డీఎన్ఏ పరీక్షలకు పోలీసులకు పంపారు. ఆ మృతదేహం శివకుమార్​దే అని తాజాగా నివేదిక అందింది. ఈ సమాచారాన్ని మృతుని బంధువులకు పోలీసులు తెలియజేశారు.

అసలు ఏం జరిగిందంటే..: నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు బాలాజీ నగర్‌కు చెందిన బాలస్వామి కుటుంబం పటాన్‌చెరు శివారులో గుడిసె వేసుకుని ఉండేవారు. కొన్నిరోజులుగా బాలస్వామి కుమారుడు శివకుమార్‌, బాలపీరు కుమార్తె ప్రేమించుకున్నారు. వాట్సప్‌లో సందేశాలను బాలపీరు తమ్ముడు ఆనంద్‌ భార్య లీల చూసి ఇంట్లో చెప్పింది. కుమార్తెను మందలించినా చాటింగ్‌ ఆపక పోవడంతో.. వారంతా శివకుమార్‌ హత్యకు పన్నాగం పన్నారు. కూతురుతో ఫోన్‌ చేయించి నగర శివారుకి రమ్మన్నారు. శివకుమార్‌ వచ్చాక ఆనంద్‌, బాలపీరులు ఆటోలో హుస్సేస్‌ సాగర్‌ కిందవైపున్న శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడే గొంతు నులిమి హత్య చేసి పక్కన ఉన్న కాలువలో విసిరేశారు. కొడుకు అదృశ్యంపై తల్లి బాలేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి.. నిందితులను పట్టుకుని రిమాండ్​కి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.