సంగారెడ్డి జిల్లా కంగ్టి, తడ్కల్లలో సోయా విత్తనాల పంపిణీ చేపట్టడం వల్ల రైతులు భారీగా తరలివచ్చి బారులు తీరారు. అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల విత్తనాలు దొరుకుతాయో లేదో అని రైతులు బారులు తీరారు.
భౌతిక దూరం.. బహుదూరం
వర్షాలు పడటం, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం వల్ల విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అరకొరగా విత్తనాలు అందుబాటులోకి రావడం కారణంగా రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భౌతిక దూరం పాటించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను క్రమంలో నిలబెట్టారు.
ఇదీ చూడండి: మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్ గుప్తాకు పాజిటివ్