ETV Bharat / state

Koratala Shiva: 'ఆచార్య చిత్రంలోని సిద్ధ పాత్రలా ఎందరో తయారుకావాలి'

Koratala Shiva: యువత చక్కగా చదువుకొని ఉన్నత లక్ష్యాలతో ఉద్యోగాల్లో చేరి ఆనందంగా ఉన్నప్పటికీ సామాజిక స్పృహతో ఉండడం లేదని సినీ దర్శకుడు కొరటాల శివ అన్నారు. సంగారెడ్డి జిల్లా నందిగామలో రెసోనెన్సీ గురుకుల పాఠశాల క్యాంపస్​ను విశ్రాంత ఐపీఎస్ అధికారి వి.వి.లక్ష్మీనారాయణతో కలిసి కొరటాల శివ లాంఛనంగా ప్రారంభించారు.

Koratala Shiva: 'ఆచార్య చిత్రంలోని సిద్ధ పాత్రలా ఎందరో తయారుకావాలి'
Koratala Shiva: 'ఆచార్య చిత్రంలోని సిద్ధ పాత్రలా ఎందరో తయారుకావాలి'
author img

By

Published : Apr 25, 2022, 6:40 PM IST

Koratala Shiva: నేటి యువత సాంకేతికత, తెలివితేటలతో వ్యవహరిస్తున్నప్పటికీ సామాజిక స్పృహ లోపిస్తోందని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవేదన వ్యక్తం చేశారు. చక్కగా చదువుకొని ఉన్నత లక్ష్యాలతో ఉద్యోగాల్లో చేరి ఆనందంగా ఉన్నప్పటికీ సామాజిక స్పృహతో ఉండడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం నందిగామలో రెసోనెన్సీ గురుకుల పాఠశాల క్యాంపస్​ను విశ్రాంత ఐపీఎస్ అధికారి వి.వి.లక్ష్మీనారాయణతో కలిసి కొరటాల శివ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించిన ప్రసంగించిన కొరటాల... తన ఆచార్య చిత్రంలోని సిద్ధ పాత్రధారులెందరో ఈ క్యాంపస్ నుంచి తయారుకావాలని కోరారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు శ్రమించాలని ఈ క్రమంలో సామాజిక బాధ్యత మరవొద్దని సూచించారు. రెసోనెన్సీ గురుకుల పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న పలువురు విద్యార్థినీ, విద్యార్థులకు మెమెంటోలు అందజేసి ప్రశంసించారు.

బిజీగా ఉన్నా కూడా ఇక్కడకు ఎందుకు వచ్చానంటే.. గురుకుల క్యాంపస్​ అనగానే కొంచెం ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఆచార్య చిత్రంలో 'సిద్ధ' ఒక గురుకుల బాయ్​. ఇక్కడ క్యాంపస్​లో ఎంత మంది సిద్ధలు ఉన్నారో చూద్దామని వచ్చాను. మీ అందరికి ఆల్​ ద బెస్ట్​. ఇంత అందమైన క్యాంపస్​లో చదువుకోవడం నిజంగా అదృష్టం. -కొరటాల శివ, సినీ దర్శకుడు

'ఆచార్య చిత్రంలోని సిద్ధ పాత్రలా ఎందరో తయారుకావాలి'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.