సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న కుప్పలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన మక్కలు తూకం కాకపోవటం వల్ల రైతులు అక్కడే కుప్పలుగా ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్లవారుజామున కురిసిన వర్షాలకు కుప్పలన్నీ తడిసిముద్దయ్యాయి.
తమ మక్కలు తడవడాని అధికారుల అలసత్వమే కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దళారుల దగ్గర్నుంచి మక్కలను సకాలంలో కొనుగోలు చేసి తమవి వెనుకపడేశారని ఆరోపించారు. దళారుల మక్కలు భద్రంగా గోదాముల్లో ఉంచి తమవి మాత్రం తడిసినా ఎవరు పట్టించుకోవట్లేదని వాపోయారు. తడిసిన మక్కలు సైతం తూకం చేసి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.