సంగారెడ్డి పట్టణం విజయ్నగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కట్టడి ముట్టడిలో డీఎస్పీ శ్రీధర్తో పాటు, 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 18 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో అనుమానంగా ఎవరైనా సంచరిస్తే తమకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.
- ఇదీ చూడండి : మాలో ఎలాంటి విభేదాలు లేవు: ఎంపీ భాజపా