సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ గణపతి జాదవ్ నేతృత్వంలో పట్టణంలోని శాంతినగర్, ఐడీఎస్ఎంటి కాలనీల్లో ఇంటింటి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల వివరాలు, ఆధార్ కార్డు పరిశీలించారు.
కాలనీలో అనుమానితులు, పొరుగు రాష్ట్ర వ్యక్తులు నివాసం ఉంటూ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు కనిపిస్తే 100 నెంబర్కి ఫోన్ చేయాలని సూచించారు. తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 24 బైకులు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో జహీరాబాద్ పట్టణ, గ్రామీణ సీఐలు సైదేశ్వర్, కృష్ణ కిషోర్, 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.