ETV Bharat / state

గ్రేటర్ పోరు: పటాన్‌చెరు డివిజన్‌లో ఘర్షణ - జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020 లేటెస్ట్ న్యూస్

బల్దియా ఎన్నికల నేపథ్యంలో పటాన్‌చెరు డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కొడుకు తనతో దురుసుగా ప్రవర్తించారని ఓ యువకుడు ఆరోపించారు. గదిలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా అభ్యర్థి ఆశిష్ గౌడ్ తనను విడిపించినట్లు పేర్కొన్నారు.

conflict at ghmc elections polling centre in patancheru
గ్రేటర్ ఎన్నికలు: పటాన్‌చెరు డివిజన్‌లో ఘర్షణ
author img

By

Published : Dec 1, 2020, 3:53 PM IST

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నేపథ్యంలో పటాన్‌చెరు డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని నర్సింగ్ అనే యువకుడు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు డివిజన్‌ 'చైతన్య నగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం పరిధిలో నర్సింగ్ భాజపా కండువా వేసుకుని వెళ్తుండగా... భాజపా కండువా ఎందుకు వేసుకుంటావు తీసేయమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారని' పేర్కొన్నారు. తనతో దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. గదిలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది తెలిసిన భాజపా అభ్యర్థి ఆశిష్ గౌడ్ తనను విడిపించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే సరాయి వద్ద స్వల్ప వివాదం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇదీ చదవండి: సికింద్రాబాద్‌ జోన్‌లో ప్రశాంతంగా పోలింగ్: జోనల్ కమిషనర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.