ETV Bharat / state

'లాక్​డౌన్​ కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలి' - CITu Trade Union, Sangareddy

కేంద్రంలో మోదీ ప్రభుత్వం కరోనా ముసుగులో కార్మిక హక్కులను పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టడం శోచనీయమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. లాక్​డౌన్​ కాలానికి పూర్తి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

CITU Strike at Industrial Area in Sangareddy
'లాక్​డౌన్​ కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలి'
author img

By

Published : May 19, 2020, 7:36 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామికవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ట్రేడ్ యూనియన్లు 3 సంవత్సరాలకు రద్దు, పనిగంటలు 8 నుంచి 12 గంటలకు పెంచడంపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఆరోపించారు. ఈ దుర్మార్గపు చర్యలను రద్దుచేయాలని ఆయన కోరారు. కార్మికులకు లాక్​డౌన్ కాలానికి పూర్తి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.