నూతన మోటార్ వాహన చట్టం అమలును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఐటీయూ నేతలు ఆందోళనకు దిగారు. కొత్త వాహన చట్టం అమలుతో చోదకులు సహా సామాన్య ప్రజలపై మోదీ సర్కారు మోయలేని భారాన్ని మోపుతోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్ ఆరోపించారు. చిన్నపాటి పొరపాట్లకు వేలాది రూపాయలతో జరిమానా విధిస్తూ జైలుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త వాహన చట్టాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : ట్రాఫిక్ వడ్డన.. పురపాలిక ఎన్నికల తర్వాతే!