ETV Bharat / state

'వరద బాధితుల తరఫున పోరాడితే అక్రమంగా కేసులు పెట్టారు'

వరద బాధితుల తరపున పోరాడితే నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారని.. వాటిని వెంటనే ఎత్తివేయాలని బీజేవైఎం నాయకులు ఆశిష్​ గౌడ్​ డిమాండ్​ చేశారు. అసలు విచారణ లేకుండా పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు

author img

By

Published : Nov 4, 2020, 4:23 PM IST

bjym press meet at sangareddy district patancheru
'వరద బాధితులకు సాయం అందిస్తే అక్రమంగా కేసులు పెట్టారు'

సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి.. ఆయన సోదరుడిపై పెట్టిన పోస్ట్​కు తనకు సంబంధం లేదని సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేవైఎం నాయకులు ఆశిష్​ గౌడ్ తెలిపారు. వరద బాధితుల తరఫున పోరాడితే నాలుగు సెక్షన్​ల కింద కేసులు పెట్టారని.. వాటిని వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

అసలు విచారణ లేకుండా పోలీసులు కేసులు ఎలా నమోదు చేస్తారని ఆశిష్​ గౌడ్​ దుయ్యబట్టారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొల్పే విధంగా వ్యవహరించారని అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. పటాన్​చెరు పోలీసులు సివిల్​ కేసుల్లో కలగజేసుకుని అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డి కలెక్టర్​ వరద బాధితులకు పరిహారం సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: దుబ్బాక ఉప ఎన్నికలో 82.61 శాతం పోలింగ్.. గతం కంటే 3.63% తక్కువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.