సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరధిలో 329 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో భిక్షపతి కుటుంబ సభ్యులు అక్రమంగా గృహ నిర్మాణం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేయొద్దంటూ వీఆర్ఏ అశోక్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అసభ్యకరంగా దుర్భాషలాడుతూ అతనిపై చెప్పులతో దాడి చేశారు.
ఈ ఘటన సందర్భంగా తన విధులకు ఆటంకం కలిగించారని, తనకు ప్రాణభయం ఉందని వీఆర్ఏ అశోక్ పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : పైసలకు పట్టాలిస్తాం... రండి బాబూ రండి...