సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అల్విన్ కాలనీలో పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్విన్ కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పటాన్చెరు పోలీసులు దాడి చేశారు.
ఈ దాడిలో ఎనిమిది మంది పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి రూ. 97,800 నగదు, ఎనిమిది చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా మరోసారి టీకా డ్రై రన్