సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన దశరథ్ అనే యువకుడు సొంత నిధులు వెచ్చించి గ్రామంతో పాటు శివారు కాలనీల్లో రసాయన ద్రావణం పిచికారీ చేయించాడు. మహమ్మారితో తన స్నేహితుడితో పాటు మరో ఇద్దరు మరణించారని.. కొవిడ్ వల్ల మరెవ్వరూ చనిపోవద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దశరథ్ తెలిపాడు. గ్రామస్థుల ఆరోగ్యం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. దశరథ్ సేవాభావాన్ని అభినందించారు.
ఇదీ చూడండి: కరోనా లేని గ్రామం ఎక్కడుందో తెలుసా..?