సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని రామచంద్రరెడ్డి నగర్లో ఉండే అనిల్‌కుమార్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. గీతం యూనివర్శిటీలో పనిచేస్తున్న అనిల్‌కుమార్ రెండురోజుల క్రితం కుటుంబంతో కలిసి ఊరెళ్లాడు. ఇది గమనించిన గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలో ఉన్న 25 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు.
దుండగుడు వచ్చిపోయే దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. చోరీపై కేసు నమోదు చేశామని... సీసీ కెమెరా దృశ్యాల సహాయంతో... జాగిలాల ఆధారంగా వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి :బంజారాహిల్స్‌లో హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు...