ETV Bharat / state

'మహిళా ఎంపీపీ పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సరికాదు'

రాజ్యాంగబద్దమైన పదవులను అనుభవిస్తున్న నాయకులు, అధికారులు ప్రోటోకాల్​ను పాటించకపోవడాన్ని మాజీ మంత్రి బాబుమోహన్ తీవ్రంగా ఖండించారు. చట్టాలను కాపాడాల్సిన అధికారులే నిబంధనలు పాటించడం లేదని అన్నారు. యాచారం ఎంపీపీ సుకన్యను తన నివాసంలో ఆయన పరామర్శించారు.

yacharam Woman MPP sukanya mla treatment is inappropriate
'మహిళా ఎంపీపీ పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సరికాదు'
author img

By

Published : May 27, 2020, 3:55 PM IST

అధికార పార్టీ ఎమ్మెల్యే రాజ్యాంగ బద్ధమైన ప్రోటోకాల్ పాటించకుండా మహిళా ఎంపీపీ పట్ల వ్యవహరించిన తీరు సరికాదని మాజీ మంత్రి బాబుమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. యాచారం ఎంపీపీ సుకన్యను తన నివాసంలో ఆయన పరామర్శించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బాధ్యులైన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో ఇటీవల ఫార్మాసిటీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి యాచారం ఎంపీపీ సుకన్యని ఆహ్వానించలేదని అడిగినా పట్టించుకోలేదన్నారు. అక్కడ ఉన్న ఎంపీపీని పక్కకు నెట్టి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టారని. పోలీసులు ఎంపీపీని నెట్టివేయడంతో ఆమె స్వల్ప అస్వస్థతకు గురైందని అన్నారు.

ఇదీ చూడండి : ''ఆ డాక్టర్లపై క్రిమినల్​ కేసులు ఎందుకు పెట్టలేదు?''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.