ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.. బంధువుల ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలంలో చోటుచేసుకుంది. ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

మొయినాబాద్​ ప్రైవేట్​ ఆస్పత్రిలో మహిళ మృతి..
author img

By

Published : Oct 17, 2019, 10:47 AM IST

మొయినాబాద్​ ప్రైవేట్​ ఆస్పత్రిలో మహిళ మృతి..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన చింతకింది మంజుల అనారోగ్యంతో బుధవారం రాత్రి మండలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు బాధితురాలికి అవసరమైన చికిత్స అందించకపోవడం వల్ల రాత్రి 2 గంటల సమయంలో మంజుల మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మంజుల మరణించిందని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి భర్త కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. తల్లిదండ్రులు మరణించడం వల్ల పిల్లలు దిక్కులేని వారయ్యారని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంజుల మృతికి కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించి పిల్లలకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్​ చేశారు.

Intro:వైద్యుల నిర్లక్ష్యం తో గృహిణి మృతిBody:*భాస్కర్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గృహిని మృతి శవంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన*

రంగారెడ్డి జిల్లా : మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింత కింది మంజుల(30) అనారోగ్యముతో బాధపడుతుండటంతో గమనించిన కుటుంబీకులు బుధవారం సాయంత్రం 6గంటలకు మొయినాబాద్ లోని భాస్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు .

అక్కడి వైద్య సిబ్బంది ఆమెకు అవసరమైన వైద్య చికిత్స అందించకపోవడముతో, రాత్రి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది బాధితురాలిని పట్టించుకోకపోవడముతో రాత్రి 2గంటలకు మంజుల చనిపోయింది. దీనితో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు..

మంజులకు ఇద్దరు కుమారులు ఉన్నారు (ఖుషి, రాకేష్) మంజుల భర్త చాల కాలం ముందే చనిపోయాడు ఇప్పుడు మంజుల కూడా చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కలిచివేసింది..Conclusion:సుభాష్ రెడ్డి, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.