రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ ఘటన తరహాలో మరో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఘటనా స్థలికి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీ రవీందర్‌రెడ్డి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.
మహిళ 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని.. ఎక్కడో హత్యాచారం చేసి ఇక్కడ పడవేశారని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, రాచకొండ పరిధిలో అదృశ్య కేసులు నమోదయ్యాయా అనే వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. క్లూస్ టీం, డాగ్‌స్వ్కాడ్ బృందంతో ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. మహిళకు సంబంధించిన వస్తువులు కానీ, దుస్తులు కానీ ఘటనా స్థలంలో లభించకపోవడం వల్ల ఆమె వివరాలు సేకరించడం కష్టంగా మారిందని వివరించారు.