శుభకృత్ నామ సంవత్సరంలో దేశం అంతా సుభిక్షంగా ఉంటుందని ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ సాగి కమలాకరశర్మ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్ స్వర్ణ భారతి ట్రస్ట్‌లో ఉగాది వైభవం పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పంచాగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
ఈ సంవత్సరం నైరుతి రుతు పవనాలు కొంత ఆలస్యంగా వస్తాయని డాక్టర్ సాగి కమలాకరశర్మ తెలిపారు. తొలకరి వ్యవసాయ పంటల దిగుబడులు బాగుంటాయని చెప్పారు. ప్రకృతి విపత్తుల కారణంగా పైర్లు దెబ్బతినడం వల్ల రైతాంగం ఆర్థికంగా దెబ్బతింటారని ఆయన పేర్కొన్నారు. మధ్య భారతదేశంలో అధిక వర్షాలు కురుస్తాయన్నారు. నువ్వులు, నల్ల ధాన్యాల పంటలు బాగా పండుతాయని తెలిపారు. జల వివాదాలు తగ్గిపోవడం.. పశుగ్రాసం కొరత లేకుండా ఉంటుదని డాక్టర్ కమలాకరశర్మ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Pragathi bhavan ugadi celebrations: 'శుభకృత్ నామ సంవత్సరంలో అంతా శుభమే'