ETV Bharat / state

Mother left Her baby : బ్యాగ్​లో దొరికిన పసిబిడ్డ.. కాళ్లపైన నాన్న పేరు - boy through out mother

Mother left Her Baby in Rangareddy Dist : తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని జన్మనిచ్చింది. పుట్టిన కొన్ని క్షణాలకే బిడ్డ కాలికి నాన్న పేరు రాసిన ఓ ట్యాగ్​ వేసి.. బ్యాగ్​లో పెట్టి రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజక వర్గంలో జరిగింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 16, 2023, 9:14 PM IST

Mother left Her Baby in Rangareddy Dist : చిన్న పిల్లలు పుట్టాలని పూజలు, దానం.. చేసిన వారిని చాలా మందిని చూశాం. చాలా మంది మగ పిల్లవాడు కావాలని ఎంతో ఆశతో ఉంటారు. పిల్లలు పుడుతున్నారంటే ఆ తొమ్మిది నెలలు మహిళ కొన్ని కష్టాలు పడుతుంది. అవన్ని పుట్టిన పసిబిడ్డను చూస్తే ఆ తల్లికి.. తొమ్మిది నెలలు పడిన బాధ అంతా ఒక్క క్షణంలో మరిచిపోతుంది. అలాంటి క్షణాలు కోసం ఎన్నో రోజులు వేచి చూస్తూంటారు. అలాంటిది దీనికి భిన్నంగా ఓ తల్లి నవ మాసాలు తన కడుపులో బిడ్డను మోసి జన్మనిచ్చింది. సీన్​ కట్​ చేస్తే ఆ బిడ్డ రోడ్డు పక్కన ఉన్న ఓ వెంచర్​ దగ్గర బ్యాగ్​లో ఉన్నాడు. పసిబిడ్డ ఏడుపు విన్న గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజక వర్గంలోని విఠ్యాల గ్రామం శివారులో ఎంఆర్​ వెంచర్​ దగ్గర ఓ బ్యాగులో అప్పుడే పసిబిడ్డని వదిలి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిపోయారు. బ్యాగ్​లో ఉన్న పిల్లవాడు ఏడువడంతో.. పక్క పొలం పని చేసుకుంటున్న ఓ యువకుడు విని వెంచర్​ దగ్గరకి వచ్చాడు. పసిబిడ్డను చూసి షాక్​ అయ్యాడు. బాబు కాళ్లపై మిస్బా సన్ అఫ్ అమీర్ ట్యాగ్ వేసి ఉంది. వెంటనే ఆ యువకుడు గ్రామ సర్పంచ్​కి ఫోన్​ చేశాడు. ఈ లోపు గ్రామస్థులు ఆ ప్రదేశానికి చేరుకుని.. ఆ దృశ్యాన్ని చూసి కలత చెందారు. పసిబిడ్డ ఏడుపు ఆపేందుకు గ్రామస్థులు ప్రయత్నం చేశారు.

చివరికి స్థానిక గ్రామానికి చెందిన ఓ బాలింత ఆ బిడ్డకు పాలు ఇచ్చింది. దీంతో ఆ పసిబిడ్డ ఏడవడం ఆపేశాడు. ఈ లోపు సర్పంచ్​ అక్కడికి చేరుకుని.. జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం తెలియజేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పిల్లవాడిని షాద్​నగర్​ పోలీస్​ స్టేషన్​కి తీసుకెళ్లారు. స్టేషన్​కి వచ్చిన ఐసీడీఎస్​ షాద్​నగర్​ సీడీపీఓ నాగమణి, సూపర్​ వైజర్లు బాలుడ్ని పరిశీలించి.. ఆలనా పాలనా చూశారు. పిల్లవాడ్ని హైదరాబాద్​లోని శిశు విహార్​కు తరలిస్తున్నట్లు నాగమణి తెలిపారు. పసిబిడ్డ తల్లి ఎవరు? పుట్టిన వెంటనే ఆ ప్రదేశానికి తీసుకొచ్చింది ఎవరు? అసలు అమీర్​ అనే వ్యక్తి ఎవరు? ఇలాంటి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.