పదవిలో లేకున్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తానని తెతెదేపా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్.రమణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని విమర్శించారు. ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. పేద ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. తెరాస, భాజపాలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కృష్ణమాచారి, జలమోని రవీందర్, జక్క రాంరెడ్డి, ఇందిరా, చక్రపాణి, కార్యకర్తలు పాల్గొన్నారు.