ETV Bharat / state

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కిడ్నాప్ చేసి కారులోనే వివాహితపై రేప్ - married women kidnap case in rangareddy

Thieves kidnaps and rapes a woman in Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని వెళ్లారు. కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న వివాహిత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివాహితపై అత్యాచారం
వివాహితపై అత్యాచారం
author img

By

Published : Feb 19, 2023, 10:34 AM IST

Updated : Feb 19, 2023, 2:22 PM IST

Thieves kidnaps and rapes a woman in Rangareddy : ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆడవాళ్లపై మృగాల ఆకృత్యాలు తగ్గడం లేదు. ప్రతిరోజూ ఏదో ఓ చోట ఎవరో ఒకరు ఈ కీచకుల చేతిలో బలవుతూనే ఉన్నారు. కొందరు హత్యాచారానికి గురై ప్రాణాలు విడుస్తుంటే.. మరికొందరు అత్యాచారానికి బలై ప్రతిరోజూ నరకం అనుభవిస్తూ చస్తూ బతుకుతున్నారు. ఈ కీచకలకు అమ్మా.. అక్కా.. చెల్లి.. బిడ్డ అనే వావి వరుసలు ఏం ఉండటం లేదు. వావి వరసలు మరిచి ఈ మదపిశాచులు ఆడవాళ్లపై విరుచుకుపడుతున్నారు.

ఆడవాళ్ల ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. ఇంటి నుంచి వెళ్తే మళ్లీ ఇంటికి సురక్షితంగా తిరిగి వస్తామో లేదోనన్న భయం వాళ్లను అనుక్షణం వెంటాడుతూనే ఉంటోంది. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నా రక్షణ ఉండటం లేదు. ఇంటిలోనే కీచకులు తయారై ఆడవారిపై పడి మృగంలా ప్రవర్తిస్తున్న వారు కొందరైతే.. ఇంటిపట్టున ఉన్న వాళ్లపై నిఘా పెట్టి మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు మరికొందరు. ఇలాంటి ఘటనే తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా పీరంచెరువులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పీరంచెరువు గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఓ వివాహితను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు. అనంతరం ఆమెను కిస్మత్​పూర్​ వైపు తీసుకువెళ్లారు. ఓ నిర్మానుష్యప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు.

ఆమె మద్యం మత్తులో ఉండగా ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మళ్లీ కారులో ఎక్కించి ఒకరు తర్వాత ఒకరు రేప్ చేశారు. రాత్రి అయిన తర్వాత ఆ మహిళను గండిపేట వద్ద వదిలి వెళ్లారు. మత్తులో నుంచి బయటకు వచ్చిన ఆమె వెంటనే భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న భర్త.. భార్యతో కలిసి నార్సింగి పోలీసు స్టేషన్​కు వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో సీసీ కెమెరాలో కారు దృశ్యాలు నమోదయ్యాయేమోనని ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 19, 2023, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.